ఓ నాలుగో సింహం మరణించింది..

మహారాష్ట్రలో కరోనాతో ఓ పోలీస్ మృతి చెందారు. మహారాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తోన్న 52 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ సందీప్ సర్వ్ కరోనాతో ఈ రోజు కన్నుమూసినట్లు ముంబై పోలీసులు దృవీకరించారు. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యంగా ముంబాయి నగరం కరోనా వ్యాప్తితో దేశంలో తొలి స్థానంలో ఉంది. మరోవైపు సూక్ష్మ జీవి యుద్ధంలో 24/7 ఆహార్నిశలు నిద్ర, తిండి తిప్పలు లేకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ కాపలా కాస్తోన్న పోలీసులు ఇలా ఈ కరోనా కొరివి దెయ్యం, మహామ్మారి చేతిలో బలవ్వడం బాధాకరం.