కరోనా కొత్త చిట్కాలు మీకోసం…

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ మహామ్మారి పట్టిపీడిస్తున్నది. ఈ వైరస్ మహామ్మారి నియంత్రించడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పద్ధతిని పాటిస్తున్నాయి.

ఈ అత్యవసర పరిస్థితుల్లో వైరస్ సోకకుండా/సోకినపుడు మన శరీరంలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే వైరస్ మన శరీరాన్ని పెద్దగా అనారోగ్యం చేయనివ్వదు. అందులో భాగంగానే ప్రపంచ జనాభాలో సగం మంది ఇప్పుడు ఆరోగ్యమే మహా భాగ్యమని జాగ్రత్తలు వహిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి మహామ్మారులు వచ్చినపుడు ఏ విధంగా ఉండాలి, దానిని ఆరికట్టేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలానే దానిపై ప్రయత్నాలపై అన్వేషణ మొదలయ్యింది.

ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ముందు జాగ్రత్తలే మనల్ని ఎన్నో రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. వాటిని తీసుకోవటం వల్ల ఇమ్యునిటీ పవర్ మన శరీరంలో పెరుగుతుంది. రోగాన్ని అడ్డుకునే విటమిన్లు, ఖనిజాలు, దగ్గు, జలుబు , తదితర వ్యాధులనుంచి సహజసిద్దమైన రక్షణ మనకు కల్పిస్తాయి. ఇమ్యూనీటి పవర్ పెంచుకోవడానికి చాలా సులవైన పద్దతులు ఉన్నాయి మనం ఇంట్లో కూడా వీటిని చేసుకోవచ్చు.

1-క్యారెట్
క్యారెట్,నిమ్మకాయ, అల్లం ముక్క, పసుపు తగినంత క్యారేట్, అల్లాన్ని శుభ్రంగా కడిగి వీటిని ముక్కలు ముక్కలుగా కోసుకుని మిక్సీకి వేయాలి. దానిని వడకట్టి వచ్చిన రసానికి నిమ్మరసం , పసుపు కలపాలి.

2- అల్లంతో
అల్లం, నిమ్మకాయ, తేనె
అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి, ఈ ముక్కలను నిమ్మరసంలో కలుపుకొని జ్యూస్ చేసుకోవాలి.వాటిని వడకట్టి వచ్చిన రసానికి తేనె కలుపుకొని తాగాలి.

3- బీట్ రూట్ తో
బీట్ రూట్, నిమ్మకాయ, అల్లముక్క
బీట్ రూట్, అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకోని వీటిని జ్యూస్ చేయ్యాలి. జ్యూస్ వడకట్టి అందులో నిమ్మరసం కలుపుకొని తాగాలి

4- దాల్చిన చెక్కతో
దాల్చిన చెక్క, అల్లం, నిమ్మకాయ
అల్లాన్ని ముక్కలుగా చేసి నిమ్మరసం, దాల్చినచెక్క పొడి జత చేసి జ్యూస్ చేసుకోవాలి దానిని వడపోసి తాగాలి.