యుద్ధం వచ్చినా ఆగని వ్యవ””సాయం””

దేశంలో జాతీయ దిగ్బంధం నేపథ్యంలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించే దిశగా కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది.

వివరాల్లోకి వెళ్తే దేశంలోని రైతులు, రైతుకూలీలకు కరోనా వైరస్‌ ముప్పు తప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2020 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంట కోతలు-నూర్పిళ్లపై ప్రామాణిక విధాన ప్రక్రియను నిర్దేశిస్తూ రాష్ట్రాలకు సర్క్యులర్‌ పంపింది.

కాగా, గోధుమ పండించే రాష్ట్రాల్లో మొత్తం సాగు విస్తీర్ణానికిగాను 26 నుంచి 33 శాతం విత్తనాలు వేసినట్లు సమాచారం అందింది.

రబీ 2020 సీజన్‌లో కనీస మద్దతు ధరతో రూ.526.84 కోట్ల విలువైన 1,07,814 టన్నుల పప్పులు, నూనెగింజలను నాఫెడ్‌ కొనుగోలు చేసింది. దీనివల్ల 75,894 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

రైతుల నుంచి టోకు వ్యాపారుల ప్రత్యక్ష కొనుగోళ్లకు అనుమతించాలని సూచిస్తూ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలకు సలహాపత్రం జారీ.

ఈ-నామ్‌ వేదికగా రైతుల కోసం 7.76 లక్షల ట్రక్కులు, 1.92 లక్షల రవాణాదారులతో ఇప్పటికే సాముదాయక రవాణా సదుపాయం ప్రారంభించబడింది.

నశ్వర వస్తువులు, విత్తనాలు, పాలు, పాడి ఉత్పత్తులుసహా నిత్యావసరాల సత్వర రవాణాకు 62 మార్గాల్లో నిర్దేశిత వేళల్లో 109 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 24.03.2020 నుంచి సుమారు 7.77 కోట్ల రైతు కుటుంబాలకు రూ.15,531కోట్ల మేర లబ్ధి.

ప్రాధాన్య గుర్తింపుగల నర్సరీలకు ధ్రువీకరణ ఈ ఏడాది జూన్‌ 30తో ముగియనున్న నేపథ్యంలో 2020 సెప్టెంబరు 30దాకా చెల్లుబాటు పొడిగింపు.

ఈ ఏడాది దేశ అవసరాలకు మించి గోధుమ దిగుబడి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఒప్పందాల మేరకు నాఫెడ్‌ ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌, లెబనాన్‌లకు 90వేల టన్నుల ఎగుమతికి అనుమతి.