ఈ పాట‌కు 1 బిలియ‌న్ వ్యూస్

ఈ పాట‌కు 1 బిలియ‌న్ వ్యూస్

‘రౌడీ బేబీ’ అనే మాట వినగానే ముందుగా గుర్తుకొచ్చేది హీరోయిన్ సాయి పల్లవి. ఆ పాట వింటుంటే ఆమె చేసిన డ్యాన్సే గుర్తుకొస్తుంది. ధ‌నుష్-సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మారి 2 సినిమాలో ‘రౌడీ బేబీ’ అంటూ అదిరిపోయే స్టెప్పులేస్తూ ప్రేక్షకులను ఆమె అలరించింది.

మాస్ స్టెప్పుల‌తో హీరో-హీరోయిన్లు ఈ పాటకు దేశ వ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చారు.యూట్యూబ్ లో ఇటీవలే ఈ పాట‌కు 1 బిలియ‌న్ వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డు సాధించిన తొలి ద‌క్షిణాది పాట‌గానూ నిలిచింది. అయితే, ఈ పాటను ఇంత పాప్యులారిటీ తీసుకొచ్చిన సాయిపల్లవి ఫొటో లేకుండా ఆ చిత్ర బృందం కేవలం ధ‌నుష్ పోస్ట‌ర్‌తో సీడీపీ పోస్ట్ చేసింది. రౌడీ బేబీ పాట విజయవంతం కావడంలో సాయి ప‌ల్ల‌వి కృషిని మర్చిపోయి కేవలం హీరో ఫొటోనే పెట్టడం పట్ల ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారు. ధ‌నుష్ ఫొటోను మాత్రమే చూపెట్ట‌డమేంటని ప్రశ్నిస్తుననారు. సాయి ప‌ల్ల‌విని అణ‌గతొక్కేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శలు చేస్తున్నారు.