ఒక్క‌రోజులో 10 వేల‌కు పైగా కరోనా కేసులు

ఒక్క‌రోజులో 10 వేల‌కు పైగా కరోనా కేసులు

తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 10,122 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,446 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,40,590 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,094గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 69,221 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,440 మందికి క‌రోనా సోకింది.