ఎట్టకేలకు 10K విద్యార్థులు సొంతిళ్లకు ప్రయాణం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ విశ్వవిద్యాలయంతో సహా ప్రయాగరాజ్ జిల్లాలో చిక్కుకున్న విద్యార్థులను సొంత జిల్లాలకు వెళ్ళేందుకు అనుమతి లభించింది. అలాగే యోగి సర్కారు ఆ విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం బస్సులు కూడా అందుబాటులో ఉంచారు. ప్రయాగరాజ్ నుంచి ఇంటికి 9,000-10,000 మంది విద్యార్థులను తీసుకెళ్లడానికి ప్రభుత్వం 300కు పైగా బస్సులను నడుపుతోంది. కరోనా కారణంగా లాక్ డౌన్1 అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో మూడవది కూడా అమలులోకి వచ్చే అవకాశాలు ఉండటంతో కరోనా మహామ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులను తల్లిదండ్రుల వద్దకు తరలిస్తున్నారు.