21 టన్నుల కరోనా కార్గో

పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కరోనాపై లైఫ్ లైన్ ప్రకటన

అంతర్జాతీయంగా భారతదేశం షాంఘై ఢిల్లీ మధ్య నేరుగా వాయు మార్గం నిర్ధారణ అయింది. ఎయిర్ ఇండియా తొలి కార్గో విమానం 4 ఏప్రిల్ 2020న ఆపరేట్ చేసి 21 టన్నుల వైద్య పరికరాలను తీసుకు వచ్చారు. అవసరానికి అనుగుణంగా కీలకమైన వైద్య పరికరాల రవాణా కోసం ఎయిర్ ఇండియా చైనాకు ప్రత్యేకంగా షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతుంది.

మన దేశంలో విమాన సర్వీసులు నడిపే ప్రైవేటు ఆపరేటర్లు దేశీయ కార్గో వ్యవస్థలైన బ్లూ డార్ట్, స్పైస్‌జెట్, ఇండిగో వ్యాపార దృష్ట్యా కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్జెట్ మార్చి 24 నుండి ఏప్రిల్ 5 వరకు 174 కార్గో విమానాలను నడిపి 1382.94 టన్నుల సరుకును చేరవేసాయి. వీటిలో 49 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 52 దేశీయ కార్గో విమానాలను 760.73 టన్నుల సరుకును చేరవేయడానికి 25 మార్చి నుండి 4 ఏప్రిల్ వరకు నడిపింది. ఇండిగో 3-4 ఏప్రిల్ 2020న 810 కార్గో విమానాలను 6103 కిలోమీటర్ల దూరం నడిపింది. 3.14 టన్నుల సరుకును తీసుకువెళ్ళింది.

లడఖ్, కార్గిల్, దిమాపూర్, ఇంఫాల్, గౌహతి, చెన్నై, అహ్మదాబాద్, జమ్మూ, కార్గిల్, లే, శ్రీనగర్, చండీగఢ్, పోర్ట్ బ్లెయిర్ సరుకుల రవాణా కోసం ఎయిర్ ఇండియా మరియు ఐఎఎఫ్ కలిసి పనిచేశాయి.