15వ ఆర్థిక సంఘం సలహా మండలి సమావేశం

15వ ఆర్థిక సంఘం సలహా మండలి 23-24 ఏప్రిల్ 2020న సమావేశం కానుంది. ONLINE లో నిర్వహించనున్న ఈ సమావేశానికి 15వ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎన్.కె. సింగ్ అధ్యక్షత వహించనున్నారు.

ఈ సమావేశంలో సలహా సంఘం సభ్యులందరూ మరియు ఆర్థిక సంఘానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సలహా మండలి సభ్యులు డా. కృష్ణమూర్తి సుబ్రమణియన్, డా.సాజిద్ జడ్ షినోయ్, డా. ప్రాచి మిశ్రా, శ్రీ నీలకాంత్ మిశ్రా మరియు డా. ఓంకార్ గోస్వామితో కలసిన 5గురు సభ్యుల బృందం 23 ఏప్రిల్ 2020న సమావేశానికి హాజరు కానున్నారు. 24 ఏప్రిల్ 2020న మండలి మిగతా సభ్యులతో మిగతా సమావేశం జరుగనుంది.

ఈ ఆర్థిక సలహా సంఘం సమావేశపు ఎజెండా ఈ విధంగా ఉండనుంది.

1. 2020-2021 మరియు 2021-2022 సంవత్సరాల్లో జిడిపి వృద్ది పై కొవిడ్-19 మహమ్మారి ప్రభావం. వివిధ సూక్ష్మరంగాల్లో అనిశ్చితి.
2. ప్రస్తుత మరియు రానున్న సంవత్సరంలో పన్ను ఉత్ప్లవనం మరియు ఆదాయంపై సంభావనీయ ప్రతిపాదనలు.
3. ఆర్థిక పరిస్థితిని గట్టెంక్కించుటకు ప్రోత్సాహకమైన/నియంత్రిత ప్రజా వ్యయము కొరకు తీసుకోవలసిన చర్యలు.