లాక్ డౌన్ తర్వాతే 10&12 పరీక్షలు: CBSE ప్రకటన

విద్యార్తులు ఆందోళన చెందకండి మీ కోసమే ఈ తీపి కబురు. కరోనా మహామ్మారి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాతే మిగిలిన 10&12 తరగతుల పరీక్షలను నిర్వహిస్తామని CBSE ప్రకటించింది. కాకపోతే మీరందరికి ఒకటే విజ్ఞప్తి కరోనా కాలంలో ఇంట్లోనే ఉండాలి, ఆన్ లైనులో మీకు నచ్చిన మెచ్చిన విషయాలను తెలుసుకోవడం మాత్రం మరవొద్దు, బయటకు అసలు రావొద్దు. సామాజిక దూరం పాటించాల్సిందే లేదంటే ఈ కొరివి దెయ్యం ఎలా విజృంభిస్తోందో మనకు అంతుచిక్కడం లేదు. చిన్నారుల్లారా, యువత మీపైనే మీ అమ్మానాన్నలు వెయ్యి కళ్లతో కోటి ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు కనీసం మీరు జాగ్రత్తగా ఉండండి.