నేడు రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు

నేడు రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు

తెలంగాణలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఓటింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.ఓటర్లు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఐదు మునిసిపాలిటీల పరిధిలోని 248 వార్డులకు గాను 1,307 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11,34,032 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 3న ఫలితాలు విడుదల కానున్నాయి.