పెళ్లి కోసం 100/100KMs సైకిల్ తొక్కిన 23 ఏళ్ల యువకుడు

లాక్ డౌన్ సమయంలో ఇచ్చిన మాట కోసం ఓ యువకున్ని 100 కిలోమీటర్ల దూరాన్ని జయించేలా చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ జిల్లా పౌతియ గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి అనే 23 సంవత్సరాలు అబ్బాయి ఏప్రిల్ 25న జరగబోయే తన వివాహం కోసం సైకిల్ పై ప్రయాణం చేస్తూ సాహసం చేసాడు. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన తన మాట నిలబెట్టుకోవడం కోసం సొంత గ్రామం నుండి సైకిల్ పై బయలుదేరి 100 కిలోమీటర్లు ప్రయాణించి మహోబా జిల్లాలోని పునియా పెళ్లికుమార్తె గ్రామం చేరుకుకున్నాడు. అక్కడే స్థానికంగా పెళ్లి చేసుకుని తిరిగి తన సైకిల్ పై నూతన వధువుతో తన గ్రామానికి పయనమయ్యాడు.

పెళ్లి కోసం సాహసం చేసిన ఈ వరుడు పదో తరగతి వరకు మాత్రమే చదువుకుని వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తన వివాహ విషయంపై అతను స్పందిస్తూ స్థానిక పోలీసులు నుండి అనుమతి కొరకు వేచి చూసి అది రాదు అని తెలిసిన తర్వాత ఎటువంటి ఆలోచన చేయకుండా తన సైకిల్ పై ప్రయాణం ప్రారంభించి ఒంటరిగా వధువు గ్రామం చేరుకున్నాడు. మోటార్ సైకిల్ ఉన్నప్పటికీ లైసెన్స్ లేకపోవడం వల్ల సైకిల్ పై ప్రయాణించాను అని చెబుతున్నాడు. కేవలం ముఖానికి చేతి రుమాలు కట్టుకుని తనను తాను కరోనా బారిన పడకుండా కాపాడుకుంటూ జీన్స్ టీ షర్ట్ వేసుకుని బయలుదేరి తన గమ్య స్థానానికి చేరుకున్నాడు.

ఈ పెళ్లి కార్యక్రమాన్ని ఆ గ్రామంలో ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా సాధారణ దుస్తుల్లో ముఖాలకు మాస్కు ధరించి జరిపారని ఏ వరుడు చెబుతున్నాడు. ఈ పెళ్లి కార్యక్రమం పూర్తయిన తర్వాత సైకిల్ పైన అతను మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యతో సహా స్వగ్రామానికి ప్రయాణం చేయవలసింది వచ్చిందని ఇలా చేయడం చాలా కష్టమైన పనిగా ఎదురైన సవాళ్లపై ఆ నవ వరుడు చెప్పుకొచ్చాడు.