కర్నూలులో 24మంది మృత్యుంజయులు

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 24 మంది డిశ్చార్చ్ కావడం జిల్లా ప్రజలకు ఊరటనిచ్చింది. ఈ సాయంత్రం డిశ్చార్చ్ జాబితాలో కర్నూలు నగరం 7 మంది, నంద్యాల పట్టణం 7మంది, పాణ్యం2, సిరివేళ్ళ2, గడివేముల1, రుద్రవరం1, నందికొట్కూరు2, ఆత్మకూరు1, డోన్ ఒకరున్నారు.

కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించి డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదు, ఫ్రూట్స్ కిట్స్ ను అందించి…ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పంపారు.

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లి కరోనా బారిన పడి..మెరుగైన ప్రభుత్వ వైద్యం..సదుపాయాలతో ..కరోనా మహమ్మారిని జయించి..ఆరోగ్యంగా, ఆనందంగా, కర్నూలు జిల్లా విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం ఇంటికి తిరిగి 24 మంది వెళ్లారు.