మిడతల నియంత్రణ కోసం ఇరాన్‌కు 25 మెట్రిక్‌ టన్నుల మలాథియన్‌ పంపిణీ: హెచ్‌ఐఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌

మిడలతల నియంత్రణకు భారత్‌ నుంచి ఇరాన్‌కు 25 మెట్రిక్‌ టన్నుల మలాథియన్‌ పురుగులమందు అందింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే హెచ్‌ఐఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఈ పురుగుల మందును ఇరాన్‌కు సరఫరా చేసింది.

ఎడారి మిడతల నివారణకు కలిసి పనిచేద్దామని ఇరాన్‌, పాకిస్థాన్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై ఇరాన్‌ సానుకూలంగా స్పందించడంతో, 25 మెట్రిక్ టన్నుల మలాథియన్‌ను ఆదేశానికి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం హెచ్‌ఐఎల్‌కు తయారీ ఆర్డర్‌ పెట్టింది. దీని ప్రకారం హెచ్‌ఐఎల్‌ మలాథియన్‌ను ఇరాన్‌ పంపింది. ఇది మంగళవారానికి ఆ దేశానికి అందుతుంది.