కరోనా కష్టాలు 80KMs కాలినడక.

కరోనా కష్టాలు 89KMs కాలినడక.

ఓ వైపు కరోనా వైరస్‌ కట్టడికి ముమ్మరంగా ప్రయత్నాలు
మరోవైపు సామాన్యుడు అష్టకష్టాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలంటూ 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించారు బాగుంది. కానీ రెక్కాడితే డొక్కాడని కార్మికులు ఒక్కసారిగా భారత్ మొత్తం బంద్ అనడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ఓ ఉదాహరణ ఉత్తరప్రదేశ్
రాష్ట్రంలో ఉన్నావ్‌ ప్రాంతంలో ఓ స్టీల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలు అత్యవసరంగా దేశమంతటా లాక్ డౌన్ చేస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశిస్తే సరే మా బతుకులు మేము భారం భరించక తప్పని అత్యవసర పరిస్థితులు ఇంటికి వెళ్దాం అనుకున్నారు. కానీ సామాన్యుడి విమానాలు అదేనండీ రైళ్లు, బస్సులు అన్నీ ప్రజా రవాణా సౌకర్యాలు బంద్ చేశారు. దీంతో గత్యంతరం లేకపోవడంతో 20 ఏళ్ల అవధేస్‌ కుమార్‌ మరికొందరు కార్మికులు కలిసి స్వస్థలం బారాబంకి
మంగళవారం సాయంత్రము కాలినడకన అడుగులు
వేసారు వీళ్లందరు గురువారం స్వగృహాలకు చేరుకోనున్నారు. దాదాపు 36 గంటలు పాటు నడిస్తే 80 కి.మీ దూరంలో ఉన్న వాళ్ల ఇంటికి చేరుకుంటారు. ఇలాంటి ధీన గాధలు ఎన్నో ఎన్నెన్నో మన దృష్టికి వచ్చిన విషయం ఇదొక్కటి ప్రస్తుతానికి ఇదండీ సంగతి. ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ఈ వార్తను టెలిక్యాస్ట్ చేసింది.