కేరళలో కరోనాతో పసికందు మరణం…

కేరళలో COVID19 మహామ్మారితో ఓ 4 నెలల శిశువు మృత్యువాత పడింది. ఆ చిన్నారి అంత్యక్రియలు అందరి హృదయాలను కలిచి వేసాయి. 2020లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ కరోనా మహామ్మారికి మందు, వ్యాక్సిన్ లేకపోవడంతో వైద్యులు ఈ చిన్నారిని కాపడలేకపోయారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం, ఈ అంత్యక్రియలు చూసిన స్థానికులు అందరూ కన్నీరు మున్నీరు అయ్యారు. కేరళ రాష్ట్రం కరోనాను అరికట్టడంలో విజయవంతంగా అడుగులు వేస్తున్నప్పటికి ఇలాంటి హృదయ విధారకర సంఘటనలు మనసులను తొలచి వేస్తున్నాయి.