ఎవరెస్ట్ పర్వతంపై 5G సేవలు ఆరంభం

ఎవరెస్ట్ పర్వతాన్నీ చైనా వైపు నుంచి అధిరోహించే పర్వతారోహకులు హైస్పీడ్ 5G నెట్వర్క్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే ఎతైన ఎవరెస్ట్ పర్వత ప్రదేశంలో 5G సేవను ఆస్వాదించే అవకాశాన్ని హిమాలయ పర్వత ప్రాంతాలలోన్న టిబెట్ ప్రాంతం పొందినట్లుగా చైనీస్ మీడియా తెలిపింది.

6500 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన బేస్ స్టేషన్ నుంచి గురువారం 5జీ నెట్వర్క్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ బేస్ స్టేషన్ ను ఇంతకుముందు 5300 మీటర్ల ఎత్తులో మరియు 5800 మీటర్ల ఎత్తులో నిర్మించి ఉన్న బేస్ స్టేషన్లకు అనుసంధానం చేయడం ద్వారా పూర్తిస్థాయిలో 5జీ సిగ్నల్స్ మౌంట్ ఎవరెస్ట్ ఉత్తరాగ్రంలో మరియు శిఖరాగ్రం నందు ఏర్పాటు చేసినట్లుగా చైనా ప్రభుత్వ రంగ మొబైల్ సంస్థ తెలియజేసింది.

ద గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం, అధికారులు ఈ ప్రాజెక్టు కొరకు 5 స్టేషన్లను అత్యంత ఎత్తులో, చాలా కష్టతరం అయిన భుబాగంలో నిర్మించి, అనుసంధానించడానికి 10 మిలియన్ యువాన్ (1.42 మిలియన్ డాలర్ల) ఖర్చు అంచనా.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్వతారోహకులు ఈ బేస్ స్టేషన్ వల్ల తమ యొక్క సమాచారం మార్పుని చాలా సులభంగా చేసుకోగలుగుతారు. అలాగే చాలామంది సహాయ సిబ్బంది మరియు పరిశోధకులకు ఈ సౌలభ్యం ఉపయోగకరంగా మారనుంది. చైనా నేపాల్ బోర్డర్ టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మౌంట్ ఎవరెస్ట్ 8840 మీటర్ల ఎత్తులో 5జి నెట్వర్క్ టిబెట్ రీజన్ పరిధికి ఉత్తర భాగంలో ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది.

ఈ 5G నెట్వర్క్ ద్వారా అధిక స్పీడ్ డాటా చేరవెయ్యడమే కాకుండా ఎక్కువ బ్యాండ్విడ్త్ నెట్వర్క్ మరియు భవిష్యత్తులో డ్రైవర్ రహిత కారు నడపడానికి, దూరప్రాంతాల్లో ఉన్నా వస్తువులతో కనెక్ట్ అవడానికి భౌతిక సమావేశాన్ని నిర్వహించడానికి మరియు టెలీమెడిసిన్ సేవల కోసం చాలా ఉపయోగకరంగా ఉండనుంది.