అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ కానున్న 7 సినిమాలు

లాక్‌డౌన్ ఎఫెక్ట్ థియేట‌ర్స్‌పై కూడా ప‌డింది. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో థియ‌టేర్స్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌ల చూపు ఓటీటీల వైపు ప‌డింది. వ‌ర‌ల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ నెట‌వ‌ర్క్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దాదాపు 7 సినిమాలు నేరుగా రిలీజ్ కాబోతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ కి సంబంధించిన డైరెక్ట్ టు సర్వీస్ స్లేట్ లో వివిధ భాష‌లకి సంబంధించిన చిత్రాల‌ని ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేయ‌నున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అధికారికంగా ప్ర‌క‌టించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ .. ‘‘అమెజాన్ లో మేము మా వినియోగదారుల మాట వింటాం, ఆ దిశగా మేము పని చేస్తాం’’ అని అన్నారు. ‘‘గత 2 ఏ ళ్లుగా వివిధ భాషల్లో, థియేటర్లలో విడుదలైన కొద్ది వారాలకే కొత్త రిలీజ్ లను చూసేందుకు గమ్యస్థానంగా ప్రైమ్ వీడియో రూపుదిద్దుకుంది. ఇప్పుడు మేము మరో అడుగు ముందుకేశాం. అంతా ఎంతగానో చూస్తు న్నఏడు భారతీయ సినిమాలను ఎక్స్ క్లూజివ్ గా ప్రైమ్ వీడియోపై ప్రసారం చేయనుంది, సినిమాటిక్ అనుభూతిని వారి ఇళ్ల ముంగిళ్లలోకి తీసుకురానుంది’’ అని అన్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఎంతగానో చూడాలనుకుంటున్న ఈ 7 సినిమాల విడుదల కోసం భారతీయ వీక్షకులు ఎంతో ఆ త్రంగా ఎదురుచూస్తున్నారు. మా వినియోగదారుల కోసం వీటిని ఇప్పుడు మేము ప్రసారం చేయడం మా కెంతో ఆనందదాయకం. వీటిని మా వీక్షకులు ఇంట్లోనే సురక్షితంగా, సౌకర్యవంతంగా తాము ఎంచుకున్న స్క్రీన్ పై చూడవచ్చు. 4000కు పైగా పట్టణాలు, నగరాలలో వీక్షణంతో భారతదేశంలో ఎంతగానో చొచ్చుకు పోయిన ప్రైమ్ వీడియో ఇప్పుడు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లలో అందుబాటులో ఉంది. ఈ సినిమాల కు అంది అంతర్జాతీయ రిలీజ్ ముద్రను అందించనుంది. ఈ కార్యక్రమం పట్ల మేమెంతో ఉద్వేగంగా ఉన్నాం. ఇది మా ప్రైమ్ సభ్యులను ఆనందపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.