దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్

దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్

దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ ప్రభావం ఉన్న 75 జిల్లాలను పూర్తిగా మార్చి31 వరకు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రమే ఈ జిల్లాల్లో అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని 5 జిల్లాలు
1. హైదరాబాద్‌ 2. మేడ్చల్‌ 3. రంగారెడ్డి, 4. సంగారెడ్డి,
5. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1. కృష్ణా 2. విశాఖ 3. ప్రకాశం జిల్లాలు కరోనా వైరస్‌ ప్రభావం ఉండటంతో లాక్ డౌన్ జాబితాలో చేర్చింది. ఢిల్లీలో 7జిల్లాలు, కేరళ 10, గుజరాత్ 6,
కర్ణాటక 5, రాజస్థాన్ 4, ఉత్తరప్రదేశ్ 6 జిల్లాలున్నాయి. పూర్తి వివరాలు క్రింది జాబితాలో ఉన్నాయి.