ఆరోగ్యమే మాహా భాగ్య ”మనీ” (MONEY)

ఓవైపు ప్రపంచాన్నీ కరోనా మహామ్మారి మింగేస్తున్న అత్యవసర పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చింది. ఆరోగ్యమే మహా భాగ్య ”మనీ” (MONEY) ఏనాడో మన పెద్దలు చెప్పేసారు కానీ మనం ధనమేరా అన్నిటికీ మూలం అనే సిద్ధాంతం ఒంట పట్టించుకున్నాం తప్ప ఇళ్లు, వాకిలి, తనువు, మనస్సు, ఆరోగ్యంపై మెజారిటీ ప్రజలు ఏనాడు దృష్టి పెట్టలేదు.

కారణం ఒక్కటే ధనం ఇధం జగత్.. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తాము చేతులో క్యాష్ ఉంటేనే మనిషికి విలువ ఉంటుందనే విధంగా లోకం పోకడలు చూశాం. కానీ నేడు కరోనా మహామ్మారి జాతి యావత్తును జాగృత్తి చేసింది.
”ధనం కాదు ముఖ్యం మనం” మనమే ముందుగా మన ఆయురారోగ్యాలను కాపాడుకోవాలి అప్పుడే ఐశ్వర్యవంతులం అంతేకానీ ఎంతుంటే ఏమి లాభం అక్కరకు రాని చుట్టం అవసరం లేని ధనం ఎందరున్న ఎంతున్నా వృధానే. ప్రపంచాన్నీ శాసించిన నాటి అలెగ్జాండర్ కూడా ఇందుకు అతీతుడు కాడు నేడు అత్యంత ధనవంతమైన దేశం, అత్యాధునిక హంగులు, రవి అస్తమించని సామ్రాజ్యానికి ప్రస్తుతం ప్రధాన మంత్రి అధికార దర్పం అన్ని ఉన్నప్పటికీ ఒక్కటే ఒక్కటి వెల్తి కరోనా మహామ్మారి కారణంగా తీవ్ర అనారోగ్యంతో UK ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు మనం మనవంతు కృషి చేయాలి అయినప్పటికీ ఇలాంటి మహామ్మారి వైరస్ సోకడం కారణంగా లేదంటే అనుకోకుండా ఎదురయ్యే సవాళ్లతో నానా రకాల అనారోగ్యంతో వైద్యో నారాయణో హరి చుట్టూ ప్రదక్షనలు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకంటే మనం మనుషులం సాటి మనిషిని ప్రేమిద్దాం మనం ఆరోగ్యంగా జీవించాలి అలాగే ప్రజలలందరూ మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రపంచ ఆరోగ్యదినోత్సవ ముఖ్య ఉద్దేశం. అందుకే గుర్తు చేయాల్సి వచ్చింది. 2020 ఏడాదిలో ‘ప్రపంచ మానవాళి అందరికి ఆరోగ్యం’ నినాదంతో 68వ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

అసలు ఎందుకు ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తామంటే 1948లో ఏప్రిల్ 7న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆరోగ్యసంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)’ ఏర్పాటైంది. ఆ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1950 నుంచి ఏప్రిల్ 7న ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.