జయహో కరోనాలో 8 డెలివరీలు

కరోనా మహామ్మారి విజృంభిస్తోన్నప్పటికి మన ప్రత్యక్ష దైవాలు వైద్యులు మాత్రం మనోధైర్యాన్ని దెబ్బ తీయలేకపోతోంది. తెలంగాణలోని మహాబుబాబాద్ జిల్లా ఉగ్గంపల్లి పిహెచ్‌సికి చెందిన డాక్టర్ రవిని నా కరోనా యోధునిగా ఆ జిల్లా కలెక్టర్ అభినందించారు. డాక్టర్ రవి COVID19 నిఘా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా, ఈ నెలలో తన పిహెచ్‌సిలోనే ఇప్పటివరకు 8 డెలివరీలు చేశాడు. అతని అంకితభావము, సేవా దృక్పధం, వైద్యం సేవలు కొనసాగించాలనే పట్టుదలపై అతనికి హ్యాట్స్ ఆఫ్ !! అతనికి మరింత శక్తి భగవంతుడు ఇవ్వాలని మహబూబబాద్ కలెక్టర్ ట్వీట్ చేశారు.