నిర్భయ ఘటనకు ఎనిమిదేళ్లు

నిర్భయ ఘటనకు ఎనిమిదేళ్లు

ఢిల్లీలో దారుణంగా హత్యాచారానికి గురైన తన కూతురు నిర్భయకు నివాళిగా తాను ఇకపై అత్యాచార బాధితులకు న్యాయం కోసం పోరాడుతానని నిర్భయ తల్లి ఆశాదేవీ ప్రతిజ్ఞ చేశారు. నేటితో నిర్భయ ఘటన జరిగి 8 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఆశాదేవీ మీడియాతో మాట్లాడారు. దోషులకు శిక్షను అమలు చేయడంతో తన కూతురికి న్యాయం జరిగిందని ఆమె చెప్పారు. అయినప్పటికీ తాను మౌనంగా కూర్చోనని ఆశాదేవి తెలిపారు. తన కూతురిలా అత్యాచారానికి గురైన బాధితులందరి తరఫున న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ఈ పనులు చేసి తన కూతురికి నివాళులు అర్పిస్తానని చెప్పారు.దేశంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. దోషులను ఉరి తీయడంతో నిర్భయకు న్యాయం జరిగిందని ఆమె అన్నారు. న్యాయవ్యవస్థపై ఆమె   సంతృప్తి వ్యక్తం చేశారు. దోషులకు అండగా నిలుస్తూ కోర్టుల్లో వాదిస్తోన్న న్యాయవాదుల తీరు సరికాదని ఆమె అన్నారు.