కరోనాలో స్నేహితుల బృందం ఆపన్న హస్తం. అన్నదాత సుఖీభవ

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాష్ట్ర  పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విస్తృతంగా, సుడిగాలి ప‌ర్య‌ట‌నలు చేసారు. మ‌హిళ‌లు, పిల్ల‌లు, ఇత‌ర వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మాస్కులు, వివిధ సేవా సంస్థ‌లు, వ్య‌క్తుల ఆధ్వ‌ర్యంలో అందిస్తున్న నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను నిరుపేద‌ల‌కు పంపిణీ మంత్రి ఎర్ర‌బెల్లి చేసారు.

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం మాటేడులో డాక్టర్ ప్రశాంత్ కుమార్ NRI, సురేష్, ఎర్ర సంపత్, పూర్ణ చందర్ స్నేహితుల స‌హ‌కారంతో అందిస్తున్న నిత్యావ‌స‌ర స‌రుకులను నిరుపేద‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ పంపిణీ చేసారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కామెంట్స్

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో నిరుపేద‌ల‌ను ఆదుకోవ‌డానికి ముంద‌కు వ‌చ్చిన ప్రశాంత్ కుమార్, పూర్ణ చందర్ స్నేహితుల బృందానికి, అభినంద‌న‌లు తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలోనే పేద‌ల‌ను ఆదుకుకోవాలి, మ‌రికొంద‌రు దాత‌లు ముందుకు వచ్చి నిరుపేద‌ల‌ను ఆదుకోవాలి. స్వ‌యంగా నేను, నా ఎర్ర‌బెల్లి ట్రస్టు ఆధ్వ‌ర్యంలో వేలాది కుటుంబాల‌ను ఆదుకుంటున్నాను క‌ష్ట కాలం వ‌చ్చింది, ఎవ‌రూ ఉపాస‌ముండే ప‌రిస్థితులు రావొద్ద‌నేదే సిఎం కెసిఆర్ అభిప్రాయబడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా గ్రామాల్లోని ప్ర‌జ‌లే ఒక‌రినొక‌రు ఆదుకునేవిధంగా సిద్ధమవ్వాలి. ఆర్థిక న‌ష్టాలు సంభ‌వించినా స‌రే, ప్ర‌జ‌లంద‌రి ప్రాణాలు కాపాడాల‌నే సిఎం లాక్ డౌన్ విధించారు. సిఎం క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌పంచ‌మంతా హ‌ర్షిస్తున్న‌ది. మ‌న‌మంతా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి. క‌రోనా పోయే వ‌ర‌కు లాక్ డౌన్ ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి.