కరోనాలో రోడ్డుపైనే ఓ వలస కూలీ ప్రసవం

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన అనిత భాయ్ తన భర్త మరియు ఆరు మంది వలస కార్మికులతో లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో తమ సొంత గ్రామానికి బయలు దేరారు. ఓ లారీపై హైదరాబాద్ నుండి ప్రయాణం ప్రారంభించారు కానీ నార్శింగ్ మండలం చేరుకోగానే ఆమెకు నొప్పులు రావడం మొదలైనాయి. దీంతో అనిత భాయ్ మరియు ఆమె భర్త లోకేష్ లను లారీ నుంచి ఆ డ్రైవర్ దించివేశాడు. ఏమి చేయాలో దిక్కు తోచని ఆ జంట దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ కోసం నడక ప్రారంభించారు కానీ దారిలోనే రోడ్డు ప్రక్కన ప్రసవ వేదనకు గురై ఆడపిల్లకు జన్మనిచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ తల్లి కూతుళ్ళను రామయమ్మ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ దుర్భర పరిస్థితులపై ప్రసవించిన అనితా భాయ్ భర్త స్పందిస్తూ మార్గ మధ్యంలో కొన్ని హాస్పిటల్స్ వెళ్లినప్పటికి ఎవరు చేర్చుకోకపోవటంతో గత్యంతరం లేక స్వగ్రామంలో అయితే తల్లిదండ్రులు చూసుకుంటారని ప్రయాణం మొదలెట్టామన్నారు.

ఐతే ప్రభుత్వం, పోలీస్ అధికారులు ముందే అనుమతి ఇచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్త పరిచారు. మంచి విషయం ఏంటంటే తల్లి పిల్ల ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వీరి బృందంలో ఇంకొక గర్బవతి కూడా వీరితో
ఉండటం ఇలాంటి వారి బాధలు అర్దం చేసుకునే వారెవ్వరు? లేకపోవడం బాధాకరం.