పురిటి నొప్పులతో కాన్పు కోసం 200KMs తిరిగిన ఓ తల్లి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కన్నీటిని తెప్పించిన ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం 200కిలోమీటర్లు తిరిగిన ఓ తల్లికి చివరికి కన్నీళ్లే మిగిలాయి. కాన్పు కోసం తిరిగితే బిడ్డ కన్నుమూసిన ఘటనపై హైకోర్టు న్యాయవాది కరణం కిషోర్ కుమార్ రాసిన లేఖతో స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం, చిన్న తాండ్రపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

సోమవారం విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అతి చిన్న హెల్త్ రీజన్ కు 6 ఆసుపత్రులు తిప్పారని న్యాయవాది కిషోర్ కుమార్ స్పందిస్తూ అత్యవసర చికిత్సలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాసిన లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకొవాలని కోరగా ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరించింది.