భయమెరుగని నాలుగో సింహంకు ఘన స్వాగతం

నాలుగో సింహం ASI హర్జీత్ సింగ్ వైద్య చికిత్స అనంతరం ఇంటికి రావడంతో కుటుంభ సభ్యులు, ఇరుగుపొరుగు బంధు వర్గమంతా ఘనంగా స్వాగతం పలికారు. వారం రోజుల కిందట పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలో లాక్ డౌన్ ఉల్లంఘించకుండా ఆపివేయబడిన నిహాంగ్స్ బృందం ఓ పోలీసు అధికారి చేతిని నరికి, మరో ముగ్గురు పంజాబ్ పోలీసులను గాయపరిచింది.

సనౌర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వెలుపల SUVలో ప్రయాణిస్తున్న బృందం పోలీసులపై దాడి చేయడంతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్  హర్జీత్ సింగ్ చేతిని కత్తితో నరికి, మరో ముగ్గురు పోలీసులు గాయపర్చారు. పాటియాలా నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్బెరా గ్రామంలో గురుద్వారా ఖిచ్ది సాహిబ్ ఉన్న నిహాంగ్ డేరా కాంప్లెక్స్‌లో ఈ బృందం దాడి చేసి పారిపోయింది. ఈ మండి పోలీసుల దాడిలో పాల్గొన్న ఐదుగురితో సహా 11 మందిని అరెస్టు చేశారు.