సూర్యపేటలో కరోనా కట్టడి పర్యటన

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో TS CS సోమేశ్ కుమార్ నేతృత్వంలో DGP మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, IG వెస్ట్ జోన్ స్టీఫెన్ రవీంద్రలతో కూడిన ఉన్నత స్థాయి బృందం పర్యటించింది. జిల్లా కేంద్రంలో కొత్తగూడ కూరగాయల మార్కెట్ కంటేయిన్మెంట్ ప్రాంతంలో పరిశీలన చేశారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష 
కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి
ప్రజలు ఆందోళన చెంద వద్దు,రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు పూర్తి చర్యలు
కంటేయిన్మెంట్ ప్రాంతాలు నుండి ప్రజలు ఎవ్వరూ బయటికి రావద్దని పిలుపు, వారికి కావలసిన నిత్యావసర,కూరగాయలు సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రైమరీ కాంటాక్టులు అన్నీ ట్రేస్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలి: CS సోమేశ్ కుమార్
జిల్లా కలెక్టర్, SP నేతృత్వంలో కలిసి కట్టుగా పని చేయాలి. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించి లాక్ డౌన్ వ్యవస్థకు సహకరించాలి: డిజిపి మహేందర్ రెడ్డి

సూర్యాపేట జిల్లాలో 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,జిల్లా జనాబా సుమారు 13 లక్షలు వున్నదని,
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జనాభా తో పోల్చితే సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.కొత్త కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్, SPల నేతృత్వంలో అన్ని శాఖలు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు