ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ముంద‌స్తు బెయిల్ మంజూరు

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ముంద‌స్తు బెయిల్ మంజూరు

ఏపీలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగాయ‌ని, సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న‌ ఆరోప‌ణ‌ల‌పై కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇటీవ‌లే 14 రోజుల విచార‌ణ పూర్తి చేసింది. అయితే, త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని హైకోర్టు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఇటీవ‌ల పిటిష‌న్ వేశారు. దీంతో ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించింది. ఆయ‌న పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.