ABCDల‌తో క‌రోనాకు కొరివి పెడదామా?

ABCDలతో కరోనా నిరోధించడమా అదెలా సాధ్య‌మ‌ని ఆలోచ‌ల‌ను, సందేహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా?? కానీ త‌ల‌చుకుంటే అసాధ్యం అనేది ఏదీ ఉండ‌ద‌ని, అన్నీ సాధ్య‌మ‌వుతాయ‌ని చెబుతున్నారు మానసిక నిపుణులు.

లాక్ డౌన్‌తో అంతా ఇళ్లకు పరిమితమై ఉంటున్నారు. అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు ఇలా వెళ్లి అలా అన్న‌ట్టు టాస్క్ పూర్తి చేసుకున్న‌ట్టు ఇంటికి చేరుతున్నారు. ఒక్క రోజు, రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు ఇంటిలో ఉండ‌డం అంటే స‌హ‌నానికి ప‌రీక్షే మ‌రి. పెద్ద స‌వాలే మ‌రి. ఊహ‌కు అంద‌ని విష‌యం. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎద‌ర్కోవాలంటే గుండె ధైర్యం చాలా అవ‌స‌రం. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ABCD చిట్కాల‌తో స‌వాళ్ల‌ను అధిగ‌మించవ‌చ్చ‌ని చెబుతున్నారు మాన‌సిక నిపుణులు. ముందుగా ABCDల్లో

A అక్ష‌రాన్ని తీసుకుందాం. Accept the situation..అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అంగీక‌రించ‌డం అన్న‌మాట‌. స‌మ‌స్య‌లు, క‌ష్టాలు ఎప్ప‌టికీ శాశ్వ‌తం కాదు. ఇవ‌న్నీ తాత్కాలిక‌మైన‌విగా గుర్తించాలి. క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ వ‌ల్ల క‌లిగే ప్రాణాపాయంను గుర్తించాలి. లాక్‌డౌన్ నేప‌థ్యాన్ని గుర్తించి ఇంట్లోనే ఉంటే మ‌న‌కే కాదు, మ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా ప్రాణహానీ ఉండ‌ద‌ని గ్ర‌హించి ఇండ్ల‌లోనే ఉంటే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

B అక్ష‌రాన్ని తీసుకుంటే.. Be patient during lockdown. లాక్‌డౌన్ అమలు లో ఉన్న స‌మ‌యంలో ఓపిక‌, ఓర్పు, స‌హ‌నంతో ఉండ‌డం అల‌వ‌ర్చుకోవాలి. అదే ప‌నిగా వారాల కొద్ది ఎటూ వెళ్ల‌కుండా ఇంట్లోనే గ‌డ‌ప‌డం అంటే ప్ర‌తి ఒక్క‌రికి విసుగు, చిరాకును తెప్పిస్తాయి. కాని త‌ప్ప‌దు. క‌రోనా వైర‌స్ పుట్టిల్లు చైనా.. మూడు నెల‌ల పాటు లాక్‌డైన్ పాటించ‌డం వ‌ల్లే వైర‌స్ బారి నుంచి తేరుకోవ‌డం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. అలానే కాస్తంతా ఓపిక‌తో మ‌నం కూడా లాక్‌డౌన్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసుకుంటే మున్ముందు వైర‌స్‌పై విజ‌యం సాధించిన‌వార‌మ‌వుతామ‌ని గ‌ట్టిన‌మ్మ‌కాన్ని క‌లిగి ఉండాలి.

C అక్ష‌రం విష‌యానికి వ‌స్తే..
Careful about physical and mental health.. అంటే శారీర‌క‌, మానసిక ఆరోగ్యంప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలా చాలా ముఖ్యం. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండ‌డం వ‌ల్ల మ‌నిషి శారీర‌క‌, మానసిక ప‌రిస్థితుల‌పై దుష్ప్రభావం చూపుతుంది. ఇలాంటి ప‌రిస్థితిని అదిగ‌మించ‌డానికి శారీర‌క‌, మాన‌సిక ఉల్లాసానికి ప్ర‌య‌త్నించాలి. వ్యాయామం, యోగా, మాన‌సిక ఉల్లాసాన్ని పెంచే ఆట‌లు , పాట‌లు పాడ‌డం వంటివి చేయాలి. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవ‌డం ద్వారా శారీర‌కంగా,మాన‌సికంగా సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటాము.

ఏబీసీడీల్లో మిగిలినది D… Develop positive hope
స‌కారాత్మ‌క దృక్ప‌థాన్ని పెంచుకోవాలి. యాంత్రిక జీవ‌న విధానంలో నిత్యం బిజీగా ఉండే మ‌నం.. లాక్‌డౌన్ ద్వారా కుటుంబ‌స‌భ్యుల‌తో స‌మ‌యాన్ని గ‌డిపే అవ‌కాశం ల‌భించింద‌ని భావించాలి. నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు అడుగులు వేయాలి. నెగెటీవ‌ల్ ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నీయ‌వ‌ద్దు. పాజిటీవ్‌తో ముందుకు వెళితే లాక్‌డౌన్ కాలంలో అనేక ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి.