థ్రిల్లర్ మూవీ బాబ్ బిస్వాస్ లో నటిస్తోన్న అభిషేక్ 

థ్రిల్లర్ మూవీ బాబ్ బిస్వాస్ లో నటిస్తోన్న అభిషేక్

బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తోన్న కొత్త సినిమాలోని ఆయన లుక్ వైరల్ అవుతోంది. థ్రిల్లర్ మూవీ బాబ్ బిస్వాస్ లో ఆయన సరికొత్త లుక్ లో కనపడనున్నాడు. ఇందులో ఫుల్‌ స్లీవ్‌ షర్ట్, పెద్ద కళ్లజోడు, సరికొత్త హెయిర్ స్టైల్ లో ఆయన కనిపిస్తున్నాడు. కాంట్రాక్ట్‌ కిల్లర్‌ బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో అభిషేక్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు.కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన షూటింగ్ కోల్‌కతాలో తాజాగా తిరిగి ప్రారంభమయ్యింది. అభిషేక్‌ సరసన చిత్రాంగద నటిస్తోంది. షారుక్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుజోయ్‌ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.కాగా, జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయింది. అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా సోకి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ షూటింగ్ కొనసాగుతోంది. షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. గుర్తు పట్టలేని విధంగా అభిషేక్ ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.