ముగింపు దశలో ‘ఆచార్య’

ముగింపు దశలో ‘ఆచార్య’

కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. చిరంజీవి – కాజల్ జంటగా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ .. జనంలోకి దూసుకెళ్లింది. అప్పటి నుంచి ఆభిమానులంతా సెకండ్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. రేపు కొరటాల పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రావొచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఫస్టు సింగిల్ వచ్చి చాలా రోజులు కావడం వలన, సెకండ్ సింగిల్ వదిలే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.ఇక కొరటాల తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉండనుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్ డేట్ కూడా రావొచ్చని ఎన్టీఆర్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఇటు మెగా అభిమానులు.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించినట్టుగా ఈ రెండు సినిమాల నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. ఇంతవరకూ కొరటాల చేసిన సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి భారీ విజయాలను అందుకున్నాయి. పరాజయమనేది ఆయనకి తెలియదు. అందువలన సహజంగానే ఆయన సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి.