కరోనాలో యాక్షన్ ఫోర్స్ క్రియలు

హైదరాబాద్ (అల్వాల్ ): కరోనా మహమ్మారిని నిర్ములించేందుకు అల్వాల్ సర్కిల్ పరిధిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అగ్నిమాపక వాహనాల ద్వారా రసాయనాలను పిచికారీ చేశారు.

టీం సాయి పెండమిక్ టాస్క్ ఫోర్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సాయి ప్రసాద్ తెలిపారు.

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ఐజీ సర్కిల్ నుంచి లోటుకుంట వరకు, బొల్లారం, కంటోన్మెంట్ ఏరియాలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు సాయి ప్రసాద్ తెలిపారు.

సాధ్యమైనంత త్వరగా కరోనాను తరిమికొట్టాలి అనే ఉద్దేశంతో ఈ ద్రావణాన్ని భారీ ఎత్తున ద్రావణం పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు.