కరోనాలో సైకిల్ తొక్కుతూ ఆగ్రాకు…

వలస కూలీల వ్యధలు వర్ణణాతీతం. UP ఆగ్రాకు చెందిన ఓ యువకుల బృదం గతంలో వలస కూలీలుగా పొట్ట చేత పట్టుకుని దక్షిణాది రాష్ట్రాలకు వచ్చారు. కానీ ఇప్పుడు కరోనా మహామ్మారి మరణంగా లాక్ డౌన్ అమలుతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. దీంతో జీవన భృతి నిలిచిపోయింది.

నెల రోజులైనా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోలేక సొంతూరుకు సైకిల్ తొక్కుతూ ప్రయాణమయ్యారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాల నుంచి ఈ యువకుల బృందం సొంతూరు ఆగ్రాకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వందలు, వేల కిలో మీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ ప్రయాణమయ్యారు.