వ్యవసాయ స్టార్టప్స్

వ్యవసాయ స్టార్టప్స్

భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి మెజారిటీ జనాభాజీవిస్తోంది. అందుకే ఏటేటా ప్ర‌భుత్వాలు ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నాయి. కానీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు
మాత్రం ఆగ‌డం లేదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు కేంద్రం,
రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చీవాట్లు పెట్టినా దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు ఆలోచించ‌డం లేదు. రైతులు చ‌నిపోతే రైతుకు ఎంతో ఆర్థిక సాయం ప్ర‌క‌టిస్తున్న సంద‌ర్భాలే ఉంటున్నాయి కానీ ఆ ఆత్మహత్యలు నివారణకు మాత్రం చర్యలు శూన్యం.
ఈ వైఖ‌రి క‌చ్చితంగా మారాల్సిందేన‌ని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. రైతును త‌న కాళ్ల మీద నిల‌బ‌డేలా ప్ర‌భుత్వాలు ఏదో చేస్తాయ‌ని ఆశించ‌డం త‌ప్పులా క‌నిపిస్తోంది. రైతు ఆదాయం పెరిగేలా, మార్కెటింగ్ అవ‌కాశం మెరుగుప‌డేలా ప్ర‌య‌త్నాలు చేయాలి. భారతదేశంలో స్టార్ట‌ప్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతున్న ఈ రోజుల్లో వ్య‌వ‌సాయానికి సంబంధించిన స్టార్ట‌ప్‌ల‌ను మొద‌లు పెట్టారు. అగ్రి స్టార్ట‌ప్‌లపై వివరాలు.

అగ్రిహ‌బ్‌
దిఅగ్రిహ‌బ్‌.com సంప్ర‌దాయ వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల‌ను, ఆధునిక సాంకేతిక‌తను ముడిపెట్టేందుకు చేసిన ఒక చిరు ప్ర‌య‌త్నం. ఈ స్టార్ట‌ప్ ఏ నిజ‌మైన వ్యాపారులు, కంపెనీల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను రైతుల‌తో అనుసంధానిస్తుంది.

డిజిట‌ల్ గ్రీన్‌
డిజిట‌ల్ గ్రీన్ అనేది ఓ లాభాపేక్ష లేని అంత‌ర్జాతీయ సంస్థ‌. ద‌క్షిణాసియాతో పాటు, స‌హారా ఆఫ్రికా ప్రాంతాల్లో ఇది ప‌నిచేస్తోంది. ఈ సంస్థ 2008లో ప్రారంభ‌మైంది.

మండి ట్రేడ‌ర్స్‌
పొలం నుంచి కొనుగోలు దాకా స‌కల స‌దుపాయాల‌ను క‌ల్పించే సంస్థ మండి ట్రేడ‌ర్స్‌. ఈ విష‌యంలో ప్ర‌తి ద‌శ‌లో రైతును ఇబ్బంది ప‌డ‌కుండా చేయ‌డ‌మే మండి ట్రేడ‌ర్స్ చేసిపెట్టే ప‌ని. బెంగుళూరుకు చెందిన ఎడ్విన్ వ‌ర్ఘీస్ దీన్ని ప్రారంభించారు.

క్రాప్ ఇన్
వ్య‌వ‌సాయ ప‌రిశ్ర‌మే ప్ర‌ధాన ఆధారంగా మొద‌లైన ఉత్త‌మ స్టార్ట‌ప్‌ల్లో ఒక‌టి క్రాప్ ఇన్‌. వ్య‌వ‌స్థాపకులు క్రిష్ణ కుమార్‌, కునాల్ ప్ర‌సాద్. చిత్త‌రంజ‌న్ జెనా సీటీవోగా ప‌నిచేస్తున్నారు. బెంగుళూరు కేంద్రంగా ప‌నిచేస్తోంది.

ఫార్మార్ట్
క‌మతాలు 70% నుంచి 90% ఉన్న దేశం మ‌న‌ది. సామాన్యుడు, చిన్న రైతుకు వ్య‌వ‌సాయ ప‌రిర‌కాల‌ను అందుబాటు ధ‌ర‌లో అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ఫార్మార్ట్ అగ్రిక‌ల్చ‌ర్‌కు సంబంధించి ఖ‌రీదైన ప‌రిక‌రాల‌ను అద్దెకు అందిస్తుంది.