కరోనా యుద్ధంలో ఆకాశ పోరాటం

*ఏయిర్ ఇండియా షాంఘై నుండి 21.77 టన్నుల వైద్య పరికరాలు*

దేశవ్యాప్తంగా సుమారు 2,675 టన్నుల వైద్య సరుకును రవాణా చేసిన ప్రైవేట్ విమానయాన సంస్థలు
దాదాపు 1,66,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిత్యావసర వైద్య వస్తువుల సరఫరా చేసిన 180 లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు.

కోవిడ్-19 లాక్ డౌన్ సందర్బంగా మొత్తం 180 విమానాల వరకు నడిపిన లైఫ్ లైన్ ఉడాన్. వీటిలో ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ విమానాలు 114 కాగా, భారతీయ వైమానిక దళానికి చెందిన విమానాలు 58 ఉన్నాయి.

దేశీయ కార్గో ఆపరేటర్లు బ్లూ డార్ట్, స్పైస్ జెట్, ఇండిగో వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్జెట్ 3,29,886 కిలోమీటర్ల మేర 241 కార్గో విమానాలను నడిపి, 1993 టన్నుల సరుకును రవాణా చేసింది. వీటిలో 175 దేశీయ కార్గో విమానాలు 1401 టన్నులను తీసుకెళ్లాయి. బ్లూ డార్ట్ 82 దేశీయ కార్గో విమానాలను 79,916 కిలోమీటర్ల మేర, 1,270 టన్నుల సరుకును రవాణా చేసింది. ఇండిగో 12,206 కిలోమీటర్ల విస్తీర్ణంలో 15 కార్గో విమానాలను నడిపింది, 4.37 టన్నుల సరుకును గమ్యాలకు చేర్చింది. పవన్ హన్స్ లిమిటెడ్ ఏప్రిల్ 8 వ తేదీ వరకు 5 కార్గో విమానాలను నడిపింది. గువహతి, అగర్తలా, కిశ్వర్, నవపాచి, శ్రీనగర్, జమ్మూ, నాగ్‌పూర్, ఔరంగాబాద్ కి 3561 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 1.07 టన్నుల సరుకు రవాణా చేసింది.

ఎయిర్ ఇండియా, ఐఎఎఫ్ ప్రధానంగా జమ్ము-కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలు ఇతర ద్వీప ప్రాంతాల కోసం కలిసి పనిచేశాయి.

కోవిడ్-19 సంబంధిత కారకాలు, ఎంజైములు, వైద్య పరికరాలు, పరీక్షా వస్తు సామగ్రి, పిపిఇ, మాస్కులు, చేతి తొడుగులు, హెచ్ఎల్ఎల్ ఇతర ఉపకరణాలను ఆయా గమ్యాలకు చేర్చాయి. రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కోరిన సరుకుతో పాటు, పోస్టల్ పార్సిళ్లను కూడా సరఫరా చేసాయి.

అంతర్జాతీయం: ఏప్రిల్ 9న ఎయిర్ ఇండియా షాంఘై నుండి 21.77 టన్నుల వైద్య పరికరాలను తీసుకువచ్చింది. అవసరానికి అనుగుణంగా కీలకమైన వైద్య పరికరాలను తీసుకురావడం కోసం ఎయిర్ ఇండియా ఇతర దేశాలకు ప్రత్యేకమైన షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతుంది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారిక వివరాలు మెవెకు అందిస్తున్నాము.