‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫస్ట్ లుక్‌ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫస్ట్ లుక్‌ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

దిగ్గ‌జ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఆయ‌న‌‌ పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుద‌ల చేశారు. ఆయ‌న‌ను చంపేందుకు బ్రిటిష్ సైన్యం చుట్టుముట్ట‌గా ఆయ‌న వారికి ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ధైర్యంగా త‌న గుండెను చూపుతూ నిల‌బ‌డిన‌ట్లు ఇందులో చూపారు.’లోడ్.. ఎయిమ్.. షూట్’ అనే డైలాగు ఇందులో విన‌ప‌డుతోంది. కాగా, ఈ సినిమాలో

కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ లకు సంబంధించిన టీజ‌ర్‌ల‌ను ఇప్ప‌టికే సినిమా బృందం విడుద‌ల చేసింది.’బాహుబ‌లి’ వంటి భారీ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమా తీస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా ప్ర‌క‌టిస్తూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతున్నారు.