మళ్ళీ యుద్ధం చేస్తోన్న అజిత్- విజయ్ అభిమానులు

మేమంతా ఒక్కటే అభిమానులు కలిసి వుండాలని పదేపదే హీరోలు ప్రకటిస్తున్నప్పటికి వారి వారి అభిమానులు వినిపించుకున్నట్లు లేరు.ఇతర హీరోల అభిమానులతో స్నేహం మాటమోకాని విరోదానికి సై అంటూ కాలు దువ్వుకుంటున్నారు. ఇలాంటి ఫ్యాన్ వార్ లో తాల అజిత్- ఇలాయదలపతి విజయ్ అభిమానులు ప్రత్యేకం.

సౌత్ ఇండియా అంతటా సోషల్ మీడియా వేదికగా హీరోల అభిమానుల మధ్య అసహ్యం కలిగించే రీతిలో ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయంటే, అందులో మేజర్ క్రెడిట్ తమిళ సూపర్ స్టార్లు ఇలాయదలపతి విజయ్, తాల అజిత్‌ల అభిమానుల పుణ్యమే. సోషల్ మీడియాలో సినీ అభిమానుల్లో కనిపించే సకల అవలక్షణాలూ వీళ్ల నుంచి మొదలైనవే. యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్,డిస్ లైక్స్ విషయంలో రికార్డుల పిచ్చికి తెర తీసింది వీళ్లే. ఈ ఇద్దరి అభిమానుల నుంచే మిగతా వాళ్లకు పాకింది.

ట్విట్టర్లో సమయం సందర్భం లేకుండా హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం.. టార్గెట్లు పెట్టి ట్వీట్లు వేయడం.. అవతలి హీరో మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి దారుణమైన రీతిలో ట్రోలింగ్ చేయడం, జుగుప్సాకరమైన రీతిలో మీమ్స్ వేయడం ఇలా ఒకటేంటి అన్ని రకాల అవలక్షణాల్ని మిగతా ఇండస్ట్రీల అభిమానులకు అలవాటు చేసిన పుణ్యం వాళ్లకే దక్కుతుంది. వేరే రోజుల్లో అయినా పర్వాలేదు.. ఒక హీరో పుట్టిన రోజు వస్తే.. మరో హీరో ఫ్యాన్స్ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. లేదా అవతలి హీరో వాల్యూ తగ్గించేలా ట్రెండ్స్ చేయడం వీరి అభిమానులకు పరిపాటిగా మారింది.గత ఏడాది జూన్ 22న విజయ్ పుట్టిన రోజు నాడు అజిత్ అభిమానులు ఇలాగే చేశారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందుకున్నారు. మే 1న అజిత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అజిత్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అతడి అభిమానులు. మరి విజయ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊరుకోలేదు. ‘విజయ్ ది ఫేస్ ఆఫ్ కోలీవుడ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి హంగామా మొదలుపెట్టారు.

దెబ్బకు అజిత్ హ్యాష్ ట్యాగ్ కిందికి వెళ్లిపోయింది. విజయ్ మీదే ఎక్కువ ట్వీట్లు పడుతున్నాయి. అతడి మీద పెట్టిన హ్యాష్ ట్యాగే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఒక టార్గెట్ పెట్టుకుని ఒక ఉద్యమం లాగా ట్వీట్లు వేస్తూ అజిత్ పుట్టిన రోజు నాడు విజయ్ ఆధిపత్యాన్ని చాటుతున్నారు అతడి ఫ్యాన్స్. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ హీరోల పరువును బజారునపడేలా వ్యవహరిస్తున్న అభిమానుల తీరుపై సర్వత్వ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇకనైనా ఫ్యాన్ వార్ కి స్వస్తి చెప్పి హీరోలకు తలవంపులు తేకుండా ఉండాలని సినిమా లవర్స్ ఆశిస్తున్నారు.