అంచనాలు పెంచుతున్న అజిత్ ‘వలిమై’

అంచనాలు పెంచుతున్న అజిత్ ‘వలిమై’

అజిత్ కొంతకాలంగా వరుస విజయాలతో ఉన్నాడు .. ఇక దర్శకుడు హెచ్.వినోద్ కూడా వరుసగా సూపర్ హిట్లు ఇస్తూ వస్తున్నాడు. ‘శతురంగ వేట్టై’ .. థీరన్ అదిగారం ఒండ్రు (ఖాకి) .. ‘నెర్కొండ పారవై’ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయనతోనే అజిత్ ‘వలిమై’ చేస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ లో అజిత్ డూప్ లేకుండా చేయడం విశేషం. ఈ సినిమాలో అజిత్ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. హుమా ఖురేషి ఆయన సరసన అలరించనుంది. ఇక తెలుగు హీరో కార్తికేయ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. కెరియర్ ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలో ఆయన తమిళంలో చేయడం .. అదీ అజిత్ సినిమాలో కావడం నిజంగా విశేషమే. ఇక ఈ సినిమా నుంచి రానున్న ఫస్టు లుక్ ఒక రేంజ్ లో ఆసక్తిని రేకెత్తిస్తుందంటే, ఈ ప్రాజెక్టుపై ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.