రిపీట్ కాబోతోన్న మనం దర్శకుడు- అక్కినేని నాగచైతన్య

లవర్ బాయ్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. మొదటి సినిమా జోష్ దెబ్బకొట్టడంతో చైతన్య మాస్ సినిమాలను వదిలి కుటుంబానికి అచ్చివచ్చిన రొమాంటిక్ చిత్రాలు చేస్తూ క్లాస్ హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకెళ్తున్నాడు. మజిలీ, వెంకీమామ విజయాలతో ఊపు మీద ఉన్న అక్కినేని వారసుడు ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రానికి శేఖర్ కమ్ములతో జట్టుకట్టడు. లవ్ స్టోరీ చిత్రీకరణ పూర్తయినప్పటికి లాక్ డౌన్ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. సమ్మర్ ఎండింగ్ లో మంచి టైమ్ చూసుకొని సినిమాను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ కరోనా శేఖర్ కమ్ముల ప్లాన్స్ ని దెబ్బేసింది.

అయితే లవ్ స్టొరీ తర్వాత చైతు ఎవరితో సినిమా చేస్తాడనేది ఫిక్స్ అవ్వలేదు. ముందుగా అనుకున్నట్లు గీత గోవిందం దర్శకుడు పరశురాంతో నాగేశ్వర్ అనే సినిమా చేయాల్సింది. కానీ పరుశురాంకి అనుకోకుండా మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో చై ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. పరుశురాం ప్రాజెక్టు హోల్డ్ లో ఉండటంతో నందిని రెడ్డి తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఫిక్స్ అవ్వలేదని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

తాజాగా చై దర్శకుల లిస్టులోకి మనం వంటి క్లాసిక్ మూవీ ని అందించిన విక్రమ్ కుమార్ వచ్చి చేరాడు. విక్రమ్ గత చిత్రం గ్యాంగ్ లీడర్ యావరేజ్ గా ఆడినప్పటికి చై తో సినిమాకి భారీ బడ్జెట్ అవసరం ఉండటంతో ఆ సినిమా ని నిర్మించేందుకు దిల్ రాజు ముందుకు వచ్చినట్లు సమాచారం. సమ్మర్ అనంతరం కూల్ గా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంటా. మరి చైతు న్యూ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి