పుట్టెడు దుఃఖంలోను బాధ్యత మరవని అలియా భట్

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ (67) గురువారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. రిషీ కపూర్ హ‌ఠాన్మ‌ర‌ణం ఆయన అభిమానులను ఎంత‌గానో బాధించింది. లాక్ డౌన్ అమలుతో తమ అభిమాన హీరో చివ‌రి చూపు చూసే అవ‌కాశం కూడా లేకుండా పోయింది. కొద్ది మంది ప్ర‌ముఖులు మాత్ర‌మే రిషీ అంత్య‌క్రియ‌ల‌లో పాల్గొన్నారు. ఆ ప్రముఖుల జాబితాలో ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్రియురాలు అలియా భ‌ట్ కూడ ఉన్నారు.

అంత్య‌క్రియ‌లు జరుగుతున్న సందర్భంగా అలియా ఫోన్ లో వీడియో చిత్రికరిస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగా ఆ ఫోటోకు ట్రోల్ చేస్తూ చాలా ఇదేం పని అంటూ ఆమెపై తీవ్ర విమర్శలు చేసారు. అయితే ఆమె అప్పుడు అలా ఎందుకు వ్యవహరించిందో తెలిసేసారికి అందరు ఆమెను అభినందిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేని రిషీ కపూర్ కూతురు రిద్దిమ కోసమే అలియా వీడియో చిత్రికరించినట్లు తెలియడంతో అందరూ అలియాను అభినందిస్తున్నారు.