విదేశీయులు రావొద్దు-వీసాలు రద్దు..

దేశంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో దౌత్య, అధికారిక, ఐక్య‌రాజ్య స‌మితి/ అంతర్జాతీయ సంస్థలు, ఉపాధి మరియు ప్రాజెక్టు క్యాట‌గిరీల‌కు చెందిన వారికి జారీ చేసిన వీసాల మిన‌హా.. విదేశీయులకు మంజూరు చేసిన అన్ని ఇత‌ర వీసాల సస్పెన్షన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

భారతదేశంలోకి వచ్చేందుకు వీలున్న 107 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల నుంచి ప్రయాణాల ర‌ద్దీని 2020 మే3 వరకు నిలిపివేయాల‌ని కూడా MHA ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అత్య‌వ‌స‌ర లేదా అంతగా అత్య‌వ‌స‌రం కాని వస్తువులు ఇత‌ర‌ సామ‌గ్రిని తీసుకువెళ్ళే వాహనాలు, విమానాలు, నౌకలు, రవాణా వాహ‌నాలు, రైళ్లు మొదలైన వాటికి వర్తించవు. వీటి సిబ్బంది, నావికుడు, డ్రైవర్, సహాయకుడు, క్లీనర్ మొదలైనవారికి అనుమ‌తి కూడా కోవిడ్‌-19 పూర్తి వైద్య పరీక్షల నిబంధ‌న‌ల‌కు లోబడి ఉండాల్సిందేన‌ని ఎంహెచ్ఏ స్ప‌ష్టం చేసింది.