48 గంటల్లో ఆస్పత్రులన్నీ తెరవాలి. లేదంటే??

కరోనా మహామ్మారి సమయంలో ఇతర జబ్బుల వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు 48 గంటల్లోపు తెరవాలని లేదా లైసెన్స్ కోల్పోతారని అధికారికంగా సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

రాబోయే రోజుల్లో కరోనా మహామ్మారిని అరికడుతూనే సాధారణ జన జీవితాన్ని కొనసాగించే పరిస్థితులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.