దేశమంతటా 560జిల్లాలు లాక్‌డౌన్‌

దేశమంతటా పూర్తి లాక్‌డౌన్‌
32 రాష్ట్రాలు/యూటీలు 560జిల్లాలు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి లాక్‌ డౌన్‌ విధించామాని ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 560జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేవలం సోమవారం రోజు మాత్రమే 99 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడని లాక్‌ డౌన్‌ను నిర్లక్ష్యం చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలను ప్రజలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిస్తున్నారు. దేశంలో ఇప్పటికే 23రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ ఈశాన్య రాష్ట్రము మణిపూర్‌లో 23ఏళ్ల యువకుడికి కొవిడ్‌-19 నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో సోమవారం నాటికి 87కేసులు నమోదవ్వగా మంగళవారం ఉదయానికి ఈ సంఖ్య 97కు చేరింది. కేరళలో 95కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.