గృహ నిర్బంధంలో దేవుళ్లు, దేవుడికి తప్పని తిప్పలు.

గృహ నిర్బంధంలో దేవుళ్లు, దేవుడికి తప్పని తిప్పలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం
శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల-తిరుపతి దేవస్థానం కరోనా కారణంగా మూసివేశారు. అంతే కాదండోయ్ దేశవ్యాప్తంగా
గుజరాత్ సోమనాథ్ ఆలయం, UP ఘోరఖ్ నాథ్ ఆలయం నుంచి మొదలేడితే తెలంగాణలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి, భద్రాచలం రామాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, అలంపూర్‌లో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, ఏడుపాయల వనదుర్గాభవాని, మట్టపల్లిలోని లక్ష్మీనృసింహస్వామి, ములుగు రామప్ప, మల్లూరు ఆలయాలు, మేడారం జాతరలో దర్శనాలు నిలిపివేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునుల ప్రధాన ఆలయాలను తలుపులు మూసివేశారు. మార్చి 31వరకు మెదక్‌ కెథడ్రల్‌ చర్చిని కూడా మూసివేసారు.

అంటే మనమే కాదండోయ్ దేవుడు కూడా ఆలయం అంటే నివాసం ఉండే స్థలం ‘గృహం’ సాక్షాత్తు భగవంతుడు కూడా తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితులు కరోనా వైరస్ కారణంగా తలెత్తాయి. కాబట్టి ప్రజలందరూ ఒకే మాట ఒకే బాటలో ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ కరోనాకు కట్టడి చేసి ప్రపంచ మానవాళికి భారతదేశం మార్గదర్శకంగా ఉండాలని విజ్ఞప్తి.