అల్జీమర్ ఇన్హిబిటర్ JNCASR శాస్త్రవేత్తలు అభివృద్ధి

ప్రభుత్వం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ (డి.ఎస్.టి) ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయిన జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) శాస్త్రవేత్తలు కర్కుమిన్ మాదిరిగానే సహజమైన మరియు చౌకైన ఉత్పత్తి అయిన భారదేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న బెర్బెరిన్ యొక్క నిర్మాణాన్ని అల్జీమర్స్ నిరోధకంగా ఉపయోగించడానికి బెర్ –డి లోకి మార్చారు. వారి పరిశోధన కార్యక్రమంల ఐ-సైన్స్ అనే సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురితమైంది.

అల్జీమర్ అత్యంత ప్రబలంగా ఉన్న న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్ మరియు మొత్తం చిత్త వైకల్యంతో పోలిస్తే 70 శఆతం ఎక్కువ. అనేక రకాలు సమస్యలు సృష్టించే ఈ వ్యాధి యొక్క మల్టిఫ్యాక్టోరియల్ స్వభావం పరిశోధకులకు సమర్థవంతమైన ఔషధాలను అభివృద్ధి చేయడం కష్టతరం చేసింది.

అల్జీమర్స్ వ్యాధికి సహజ ఉత్పత్తి ఆధారిత చికిత్సా విశేషాలన్ని కనుగొనే సంకల్పంతో JNCASRకు చెందిన స్వర్ణజయంతి ఫెలో శ్రీ టి.గోవిందరాజు, భారతదేశం మరియు చైనాలో దొరికిన ఐసోక్వినోలిన్ సహజ ఉత్పత్తి బెర్బరిన్ ను ఎంచుకున్నారు. అదే విధంగా సంప్రదాయ ఔషధాలు మరియు ఇతర అనువర్తనాల్లో ఉపయోగించారు. బెర్బెరిన్ చాలా సున్నితంగా కరిగేది మరియు కణాలకు విషపూరితమైనది కావడం వల్ల దీన్ని బెర్-డి గా మార్చారు. ఇది కరిగే (సజల), యాంటీ ఆక్సిడెంట్. అల్జీమర్స్ వ్యాధి యొక్క బహుముఖ అమిలాయిడ్ టాక్సిసిటీ యొక్క మల్టి ఫంక్షనల్ ఇన్హిబిటర్ అని వారు కనుగొన్నారు.

రియాక్టివ్ ఆక్సిజన్ స్పిసీస్ (ఆర్.ఓ.ఎస్), మైటో కాన్డ్రియల్ పనిచేయకపోవడం, సినాప్టిక్ సిగ్నలింగ్ లో సమస్యలు రావడం మరియు కణాలను చంపేయడం లాంటి న్యూరోనల్ కణాల్లో గమనించిన బహుముఖ టాక్సిసిటీ ప్రొటీన్ అగ్రిగేషన్ మరియు అమిలాయిడ్ టాక్సిసిటీ ప్రధానంగా దోహదం చేస్తాయి. జె.ఎన్.సి.ఎ.ఎస్.ఆర్. బృంద సెల్యులో మల్టీఫేస్డ్ టాక్సిసిటీలో మెరుగుపడడానికి ఈ మల్టిఫంక్షనల్ ఇన్హిబిటర్ ను అభివృద్ధి చేసింది.

బెర్-డి నిర్మాణ లక్షణాలు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ (ఆర్.ఓ.ఎస్) ఉత్పత్తిని మరియు ఆక్సీకరణ నష్టం నుంచి బయో మాక్రో మెలుక్యూల్స్ ను రక్షించడాన్ని నిరోధిస్తాయి. లోహ-ఆధారిత మరియు ఆధారిత అమిలోయిడ్ బీటా (Aβ) యొక్క సంకలనాలను బెర్ –డి నిరోధిస్తుంది. (ఇవి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల మెదడులో కనిపించే అమిలాయిడ్ ఫలకాల ప్రధాన భాగం అల్జీమర్స్ వ్యాధిలో కీలకమైన అమైనో ఆమ్లాల పెప్టైడ్ లు)

అల్జీమర్స్ వ్యాధి యొక్క బహుముఖ Aβ టాక్సిసిటీని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ బృందం బెర్-డి ని అభివృద్ధి చేసింది. బెర్బెరిన్ 4 ఫెనోలిక్ హైట్రాక్సిల్ సమూహాలను కలిగి ఉంది. ఇవి మిథైలేటెడ్, అందువల్ల నీటిలో కరగవు. నీటిలో కలిగే ఫాలీ ఫెనోలిక్ ఉత్పన్నమైన బెర్-డి పొందడానికి సహజ ఉత్పత్తి బెర్బెరిన్ డీ మెథైలేషన్ కు గురైంది. డీ మెథైలేషన్ ఏజెంట్ బిబిఆర్-3 (బోరాన్ ట్రిబ్రోమైడ్) తో బెర్బెరిన్ చికిత్స్ బెర్ –డి ఇచ్చింది. బెర్బరిన్ డీ మిథైలేషన్ కారణంగా, 4 ఫినోలిక్ సమూహాలు సులభంగా నీటిలో కలిగే సామర్థ్యాన్ని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్ స్థాయిని పెంచుతాయి. బెర్-డి అల్జీమర్స్ వ్యాధి యొక్క Aβ టాక్సిసిటీ మరియు అల్జీమర్స్ వ్యాధి యొక్క బహుముఖ టాక్సిసిటీ మెరుగుపరచడానికి క్యూ-కోఆర్డినేషన్. బెర్ –డి చికిత్స మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడం మరియు అకాల అపోప్టోసిస్ (సెల్ డెత్)కు దోహదం చేసే న్యూరానల్ టాక్సిసిటీని నివారిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిలో బహుముఖ Aβ టాక్సిసిటీని మెరుగు పరిచేందుకు బెర్ –డి సంభావ్య పదార్థంగా మారుతుంది.

యాంటీ ఆక్సిడెంట్ బెర్-డి రియాక్టివ్ నైట్రోజన్ స్పిసీస్ (ఆర్.ఎన్.ఎస్) మరియు రియాక్టివ్ ఆక్సిజన్ స్పిసీస్ (ఆర్.ఓ.ఎస్) రెండింటిన సమర్థవంతంగా అణచివేయగలదు. అదే విధంగా డి.ఎన్.ఏ. దెబ్బతినడం, ప్రొటీన్ ఆక్సీకరణం మరియు లిపిడ్ పెరాక్సిడేషన్ ను నివారిస్తుంది. ఇవి న్యూరోనల్ మరణానికి దారి తీసే అనేక ప్రతికూల జీవ రసాయన క్యాస్కేడ్ ప్రతిచర్యలకు కారణం అవుతాయి. బెర్-డి టాక్సిక్ AB ఫైబ్రిల్లర్ అగ్రిగేట్స్ ఏర్పాటును నిరోధిస్తుంది. అదే విధంగా న్యూరోనల్ చనిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన మైటోకాండ్రియాను పని చేయకుండా కాపాడుతుంది. మల్టి ఫంక్షనల్ యాంటీ ఆక్సిడెంట్ మరియు అగ్రిగేషన్ మాడ్యులేటర్ అయిన బెర్బెరిన్ ను బెర్ –డి గా కృత్రిమంగా మార్చే వారి రూపకల్పన వ్యూహం, విట్రో మరియు సెల్యులో పరిస్థితుల్లో బహుల ఆటాక్సిసిటీని సమర్థవంతంగా మెరుగు పరుస్తుంది.

ఈ మల్టీ ఫంక్షనల్ గుణాలు అల్జీమర్స్ వ్యాధి యొక్క బహుముఖ టాక్సిసిటీకి చికిత్స చేయడానికి సమర్థవంతమైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి బెర్ –డి ని ఉత్తమ పదార్థంగా చేస్తాయి.