రాజధాని భూ అక్రమాల కేసు సీబీకి అప్పగింత

రాజధాని భూ అక్రమాల కేసు సీబీకి అప్పగింత

అమరావతి ప్రాంతంలో జరిగిన అవకతవకలపై గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరపాలని సీబీఐని కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
ప్రధానంగా ఇన్సైడర్ ట్రేడింగ్ తో పాటు మనీ లాండరింగ్ లాంటి అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు ప్రాంతమని ముందస్తుగా కొంతమందికి చెప్పడంతో
వేల కోట్ల రూపాయలు కొందరికే లబ్ది చేకూర్చారనేే రిపోర్టు
తయారైంది. ఈ అంశాలపై సీబీఐ విచారణ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కోరింది. అసైన్డ్ భూముల విషయంలో అప్పటి చట్టాల్ని సవరించి భారీగా
లబ్ది పొందారని ఆ రిపార్టులో పేర్కొన్నారు. తెల్లరేషన్
కార్డు హోల్డర్ల పేరు మీద భారీస్థాయిలో వేల కోట్ల రూపాయల భూములు కొన్నారని ఆధారాలతో కేబినెట్ సబ్ కమిటీ
నివేదిక ఇచ్చిందని ఆ రిపోర్టు ఆధారంగా విచారణ జరపాలని కోరారు.