ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కోవిడ్ -19 మహమ్మారి పై పోరాటానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూం కార్యకలాపాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు.
వివిధ రాష్ట్రాలలో కోవిడ్ -19 పరిస్థితిపై కంట్రోల్ రూములోని అధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారి అభిప్రాయాలను తెలుసుకుని
వారు చేస్తున్న అద్భుత కృషిని ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కంట్రోలు రూమ్ 24 గంటలూ పనిచేస్తోంది. ఇది రాష్ట్రాలతో మాత్రమే కాకుండా కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ
శాఖలతోనూ సమన్వయం చేస్తోంది.