CM జగన్ కు అమిత్ షా ఫోన్…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసారు. రాష్ట్రంలో కరోనా మహామ్మారి కారణంగా అమలవుతోన్న లాక్‌ డౌన్‌ పరిణామాలు, తర్వాత అనుసరించాల్సిన వ్యూహలపైనా చర్చలు జరిపారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను YS జగన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా నిర్ధారణకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఇచ్చిన సడలింపుల ప్రభావం, ఎదురవుతోన్న సవాళ్లపై సమాలోచనలు చేసారు.