బచ్చన్ మనవరాలి పెయింటింగ్ చూసి నెటిజన్లు ఫిదా

అమితాబ్ బచ్చన్ కోట్లాదిమందికి ఆరాధ్య కథానాయకుడు. వయసు పైబడుతున్న లెక్క చేయని యోధుడిలా నిత్యం తన కళ తో కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తూ 7 పదుల వయసులోనూ సినిమాలతో బిజీగా ఉన్న కళాకారుడు. లాక్ డౌన్ పుణ్యమా కొంత షూటింగ్ గ్యాప్ రావడంతో షోషల్ మీడియాలో అక్టీవ్ అయ్యాడు.

కోవిడ్ 19 విజృంభిస్తున్న వేళా సెలెబ్రిటీలాంత వారి వారి మార్గాల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమంలో వివిధ రూపాల్లో చేస్తున్నవస్తున్నారు. కొత్త కొత్త ఛాలెంజ్ లు విసురుతూ, షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఇలా ప్రజల్లోకి వెళ్తున్నారు సెలెబ్రెటీలు. షోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సీనియర్ బచ్చన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తన అభిమానులను ఆలోచింపచేస్తుంది. కోవిడ్ తో పోరాటంలో ముందున్న వైద్య, రక్షణ, మీడియా, విద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ తన 8 ఏళ్ల మనవరాలు ఆరాధ్య అదేనండి మన అందాల ఐశ్వర్యారాయ్ కూతురు గీసిన పెయింటింగ్ ని షేర్ చేసాడు అమితాబ్ బచ్చన్. ఆరాధ్య గీసిన చిత్రపటాన్ని చూస్తుంటే స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదాన్ని చిన్నపిల్లల్లోకి సైతం తీసుకెళ్లడంలో ప్రభుత్వాలు, సెలబ్రిటీలు చేసిన కృషి కనిపిస్తుంది. కళలు తన రక్తంలోనే ఉన్నాయనే విషయాన్ని ఆరాధ్య నిరూపించుకుందంటూ బచ్చన్ సాబ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.