మాస్క్ ఫోర్స్ క్రికెటర్స్ టీం…

కరోనా కట్టడికి మాస్క్ ఖచ్చితంగా వాడాలని క్రికెటర్లు మాస్క్ ఫోర్స్ టీంతో భారతీయులు అందరికీ విజ్ఞప్తి చేసారు.

ఈ వైరస్ మహామ్మారిని మాస్క్ తో అడ్డుకట్ట వేయాలని మాస్కులు స్వతహాగా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనే విధానంపై క్రికెటర్లు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్, దాదా గంగూలీ, గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాహుల్ ద్రావిడ్, మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ ఇలా చాలా మంది క్రికెటర్లు కలిసి ఓ వీడియోను రిలీజ్ చేసారు.

భారత జట్టులో సభ్యులుగా గర్విస్తున్నాం అలాగే ఇవాళ మనం అతి పెద్ద జట్టును సృష్టించనున్నామని విరాట్‌ కోహ్లీ, గంగూలీ కరోనాపై పోరుకు టాస్క్‌ఫోర్స్‌ లానే టీమ్‌ మాస్క్‌ ఫోర్స్‌, టీమ్‌ మాస్క్‌ ఫోర్స్‌లో చేరడం ఎంతో సులువని, అందరూ ఇంట్లోనే ఉండాలని, తప్పని అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ను ధరిస్తే సరిపోతుందని విజ్ఞప్తి చేసారు.