త్వ‌రలో అమృతం సీరియల్‌ PART 2..

  1. త్వ‌రలో అమృతం సీరియల్‌..రెండో సిరీస్‌
    ట్రైల‌ర్‌ను లాంచ్ చేయ‌నున్నరాజ‌మౌళి

-ఒకప్పుడు తెలుగు లో బాగా క్లిక్ అయిన సీరియల్స్ వేళ్ళ మీద లేక్కేయొచ్చు. అందులో ‘అమృతం’ ఒకటి. కామెడీ పాత్రలతో కంప్లీట్ గా ఎంటర్టైన్ చేసి క్లాసిక్ అనిపించుకున్న ఈ సీరియల్ కి ఇప్పుడు రెండో సిరీస్ వస్తుంది. అవును నిర్మాత గుణ్ణం గంగరాజుతో కలిసి జీ -5 సంస్థ ఈ సీరియల్ ను మళ్ళీ తీసుకొస్తుంది.

ఉగాది స్పెషల్‌గా ప్రారంభం:
– ఈ నెల 25 న ఉగాది స్పెషల్ గా ఈ సీరియల్ జీ 5 లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ప్రమోషన్ కూడా మొదలుపెట్టిన టీం తాజాగా అమృతం కోసం జక్కన్న సపోర్ట్ కోరింది. దీంతో రాజమౌళి ఇప్పుడు రంగంలోకి దిగి సోషల్ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా ‘అమృతం 2’ ను ప్రమోట్ చేయబోతున్నాడు. ట్విట్టర్ ద్వారా సీరియల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి తన మనసులో మాటను ఈ నెల 14న జ‌క్క‌న్న చెప్ప‌నున్నారు. దీంతో అమృతం -2 ఒక్కసారిగా మళ్ళీ అందరి నోట్లో నానుతుంది. ఎలాగు ఎపిసోడ్స్ బాగుంటే జనాలు చూస్తారు కాబట్టి క్లిక్ అయ్యే చాన్స్ ఉంది. ఇక జక్కన్న ఈ ట్రైలర్ లాంచ్ చేసి ఏం చెప్తారో అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.